కీర్తి సురేష్ తెలుగులో ఇన్నాళ్లకు మొదలెట్టింది…!

Keerthy Suresh To Do A Lady Oriented Film In Telugu

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మహానటి. ఈ చిత్రం సావిత్రి జీవితం ఆధారంగా రూపొందించాడు. తెలుగు, తమిళ పరిశ్రమకు సుపరిచితురాలైన సావిత్రి జీవితాన్నీ రెండు బాషల్లో విడుదల చేసి మంచి విజయాన్నీ సంపాదించాడు. కీర్తి సురేష్ కూడా, సావిత్రి అవబవాలను చక్కగా పలికించి ఆనాటి సావిత్రి మరల కీర్తి సురేష్ రూపంలో పుట్టింది అనుకునే విధంగా నటించింది. తెలుగు, తమిళ ప్రేక్షకులు ఇప్పటికి కీర్తి సురేష్ ని జూనియర్ సావిత్రి గా పిలుస్తారు. ఇలాంటి పాత్రలు ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప రావు. ఇప్పటి సినిమా పరిశ్రమకు చెందినా నటీమణులు కుడా ఇలాంటి పాత్రలకోసం ఎదురుచూస్తుంటారు. అంత మంచి పాత్రలో నటించిన కీర్తి సురేష్, ఆ తరువాత తమిళంలో పందెం కోడి 2, స్వామి2 వంటి చిత్రాలో నటించింది.

ఆ చిత్రాల్లో ఆమె గుర్తింపు లేని పాత్రలో నటించేసరికి ఆమెకు ఏలాంటి గుర్తింపు రాలేదు. ఇంకా ఆ తరువాత కీర్తి సురేష్ మరో సినిమా చెయ్యడానికి చాలా సమయం తీసుకుంది. ఇకా తెలుగులో మాత్రం మహానటి సినిమా తరువాత మరో సినిమాను చెయ్యలేదు. తాజాగా కీర్తి సురేష్ ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ లో నటించేందుకు పచ్చ జెండా ఉపేసింది అందుకు సంబందించిన పూజ కార్యక్రమాలు నిన్న మొదలైనాయి. నరేంద్ర అనే కొత్త దర్శకుడితో ఓ సినిమాలో నటిస్తుంది. నందమూరి కళ్యాణ్ రామ్ తో నా నువ్వే, 118 చిత్రాలను రూపొందించిన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఓ లేడీ ఓరియెంటెడ్ మూవీ లో నటించేందుకు సిద్దం అయ్యింది. నందమూరి కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్ పై క్లాప్ కొట్టి మరి షూటింగ్ ప్రారంభించాడు. కొత్త డైరక్టర్ తో కీర్తి సాహాసం చేస్తుందనే చెప్పుకోవాలి.