మన టాలీవుడ్ సహా దక్షిణాది మూవీ దగ్గర ఉన్నటువంటి ప్రెజెంట్ టాప్ మోస్ట్ టాలెంటెడ్ అండ్ స్టార్ హీరోయిన్స్ లో కీర్తి సురేష్ కూడా ఒకరు అని తెలిసిందే. మరి పలు వరుస మూవీ లతో బిజీగా ఉన్న కీర్తి సురేష్ బాలీవుడ్ లో “బేబీ జాన్” మూవీ తో ఎంట్రీ ఇవ్వబోతుంది. మరి ఈ క్రమంలో తనపై మరో వార్తలు ఇపుడు వైరల్ గా వినిపిస్తున్నాయి.
ఆమె ఇపుడు తన పర్శనల్ లైఫ్ లో కొత్త స్టెప్ తీసుకోబోతున్నట్టుగా టాక్ వైరల్ అవుతుంది . తన చిన్ననాటి స్నేహితుణ్ని ఆమె వివాహమాడనున్నట్టుగా ఇపుడు లేటెస్ట్ టాక్. మరి అది కూడా ఈ ఏడాదిలోనే వచ్చే డిసెంబర్ లోనే పెళ్లి ఉంటుంది అన్నట్టుగా తెలుస్తోంది . ఈ డిసెంబర్ 11న గోవాలో వీరి వివాహం జరగనుంది అని అంటూ పలు రూమర్స్ ఇపుడు ఒక్కసారిగా స్టార్ట్ అయ్యాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉన్నది అనేది వేచి చూడాలి. ఇక ఇదే డిసెంబర్ లోనే కీర్తి బేబీ జాన్ రిలీజ్ కూడా ఉన్నది .