ఈమధ్య కీర్తి సురేష్ పేరు వార్తల్లో బాగా వినిపించింది. కీర్తి ప్రేమలో పడిందని, ఢిల్లీకి చెందిన ఓ బీజేపీ నేత కుమారుడిని ప్రేమిస్తోందని, పెద్దలు కూడా వీళ్ల ప్రేమని అంగీకరించి, పెళ్లికి ఒప్పుకున్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతోందని.. ఇలా రకరకాల వార్తలొచ్చాయి. వీటిపై కీర్తి స్పందించింది కూడా. ప్రేమ – పెళ్లి విషయాల గురించి ప్రస్తుతం ఆలోచించడం లేదని క్లారిటీ ఇచ్చింది. దాంతో ఇవన్నీ కేవలం గాసిప్పులే అనుకున్నారంతా.
నిజానికి… కీర్తి ప్రేమ కథల్లో వాస్తవం లేకపోలేదని టాక్. కీర్తి ప్రేమలో పడిందన్న మాట నిజమే అని, కానీ.. ఆ విషయాన్ని కీర్తి దాచే ప్రయత్నం చేస్తోందని, ముందు తన చేతిలో ఉన్న సినిమాల్ని పూర్తి చేసి, అప్పుడు తన ప్రేమికుడ్ని ప్రపంచానికి పరిచయం చేయాలని భావిస్తోందని చెప్పుకుంటున్నారు.