సంచలనం సృష్టించిన రూ.కోటీ పది లక్షల లంచం కేసులో నిందితుడిగా ఉన్న కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అతడు ఉరివేసుకుని ప్రాణం తీసుకున్నాడు. కీసర మండలం తహసీల్దారుగా విధులు నిర్వహిస్తున్న నాగరాజును ఇటీవ ల రూ.కోటీ పది లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ బృందం దాడులు చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.
దీంతో అతనిపై కేసు నమో దు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం అతన్ని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున జైల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి నాగరాజు కిటికీకి టవల్‌తో ఉరివేసుకుని కనిపించాడు. దీంతో అప్పటికప్పుడు అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెంది నట్లు వైద్యులు ధ్రువీకరించారని జైలు అధికారులు తెలిపారు.