ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా వైరస్ సోకింది. ఆయనకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు ఉన్నాయని, దీంతో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు ట్విటర్లో వెల్లడించారు. గత కొన్ని రోజుల నుంచి తనతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నవారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ఇటీవల అయిన ఉత్తరాఖండ్, పంజాబ్‌లో రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే.