Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు నేల సంచలనం నందమూరి తారకరాముడు. ఆయన జీవితాన్ని స్పృశిస్తూ ఇప్పటికే రెండు సినిమాలు అనౌన్స్ చేశారు. ఎన్టీఆర్ జీవితం మహాభారతం అంత. అందులో నేను తీసే లక్ష్మీస్ ఎన్టీఆర్ కేవలం ఆయన లైఫ్ లో లక్ష్మీపార్వతి ప్రవేశం తరువాత మాత్రమే అని రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ఇక తేజ దర్శకత్వంలో బాలయ్య హీరోగా తీస్తున్న బయోపిక్ లో నాదెండ్ల ఎపిసోడ్ ని దాటి ఎన్టీఆర్ రెండోసారి సీఎం అయ్యే దాకా తీస్తున్నారు. అయితే ఎన్టీఆర్ జీవితంలోకి రాకముందు లక్ష్మీపార్వతి ఏమిటి, ఎన్టీఆర్ జీవితంలోకి ఆమె ఎలా ప్రవేశించింది అన్న కోణంలో ఇంకో సినిమా రాబోతోంది.
లక్ష్మీస్ వీరగ్రంధం పేరిట తీసే ఈ సినిమాలో లక్ష్మీపార్వతి మొదటి భర్త వీరగంధం సుబ్బారావు ఎపిసోడ్ కీలకం కాబోతోంది. ఇది నిజంగా లక్ష్మీపార్వతికి షాక్. ఈ సినిమా అనౌన్స్ చేసిన దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి చెన్నై లో తెలుగు వాళ్ళు అందరికీ తెలిసినవాడే. తమిళనాడులో తెలుగు వాణి వినిపించే ఈ రెడ్డి గారు ఒకప్పుడు వై.ఎస్, జగన్ కి అనుకూలంగా ఎన్నో ప్రకటనలు కూడా చేశారు. కామ, కామాగ్ని లాంటి శృంగారభరిత చిత్రాలు తీసిన చరిత్ర కూడా ఆయన సొంతం. ఇప్పుడు లక్ష్మీస్ వీరగ్రంధం అన్న టైటిల్ లోనే ఆయన ఉద్దేశం ఏంటో అర్ధం అవుతోంది. అయితే ఎన్టీఆర్ మీద అభిమానంతోనే పదేళ్ల తరువాత ఓ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నట్టు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రామ్ గోపాల్ వర్మ సినిమా వెనుక వైసీపీ హస్తం ఉందన్న ఆరోపణలు వస్తుంటే ఈ సినిమా నిర్మాణం వెనుక టీడీపీ హ్యాండ్ ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి ఎన్టీఆర్ వచ్చే ఏడు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.