సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వంశీని 10రోజులపాటు కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం… ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. వంశీ సహా ముగ్గురిని కస్టడీకి కోరారు పోలీసులు. మరోవైపు వంశీ తరపు లాయర్లు వేసిన బెయిల్ పిటిషన్‌పైనా విచారణ చేపట్టిన కోర్టు… తీర్పును వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఇటు కిడ్నాప్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టులో సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు వల్లభనేని వంశీ.