కన్నడ రాక్‌స్టార్ యశ్ దంపతులు కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. శుక్రవారం ఉదయం యశ్ దంపతులు గృహ ప్రవేశ వేడుకను నిర్వహించి కుటుంబ సమేతంగా కొత్తింటిటోకి అడుగుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. బెంగళూరులోని ఖరీదైన ప్రెస్టీజ్ గోల్ప్ అపార్టుమెంట్‌లో యశ్ ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. ఈ మేరకు యశ్ దంపుతులు నూతన గృహ ప్రవేశం చేసి పూజా కార్యక్రమం నిర్వహించారు.
ఈ వేడుకలో యశ్, రాధికల తల్లిదండ్రులు, అంత్యంత సన్నిహితులు, కొద్ది మంది బంధువులు మాత్రమే పాల్గొన్నారు.కాగా యశ్ నటించిన ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ విడుదలకు సిద్దమవుతుంది. దీంతో ప్రస్తుతం అతడు ఈ సిక్వెల్ రిలీజ్‌లో బిజీగా ఉన్నాడు. ఇందులో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తుండగా.. రవీనా టాండన్, రావు రమేష్, ప్రకాష్ రాజ్‌లు కీలక పాత్రలు పోషించారు. త్వరలోనే ఈ మూవీ కన్నడ, హిందీ, తెలుగు, తమిళ బాషల్లో విడుదల కానుంది.