ఖాకి… తెలుగు బులెట్ రివ్యూ

khakee Movie review

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

నటీనటులు :   కార్తి, రకుల్  ప్రీత్  సింగ్ 

నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు
దర్శకత్వం :
వినోత్
సినిమాటోగ్రఫీ: సత్యాన్ సూర్యాన్
ఎడిటర్ : శివనందీశ్వరన్
మ్యూజిక్ : జిబ్రాన్ 

కార్తీ తమిళ్ కుర్రోడే అయినా దాదాపు అతని ప్రతి సినిమా తెలుగులో కూడా విడుదల అవుతోంది. ఉపిరి తర్వాత తెలుగులో వచ్చిన ఇమేజ్ పెంచుకోడానికి కార్తీ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడు. ఈ ఆలోచనతో విడుదల అయిన గత రెండు సినిమాలు కార్తీ ఆశలను వమ్ము చేశాయి. ఖాకీ సినిమాతో ఇప్పుడు మళ్లీ కార్తీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తమిళ్ తో పాటు తెలుగులోనూ ఒకే రోజు విడుదల అయిన ఖాకీ ఎలా వుందో చూద్దాం.

కథ…

ధీరజ్ హరి ప్రసాద్ ips ట్రైనింగ్ లో ఉండగానే పక్కింట్లో అద్దెకు దిగిన ప్రియ( రకుల్ ప్రీత్ సింగ్ ) తో లవ్ లో పడతాడు. ఇద్దరూ ఆ ప్రేమని పెళ్లిదాకా తీసుకెళతారు. అయితే పోలీస్ డ్యూటీ లో చేరాక ధీరజ్ నిజాయితీ కారణంగా పదేపదే ట్రాన్స్ ఫర్ అవుతుంటుంది. అదే సమయంలో చెన్నై హై వే పక్కన నివాసం ఉంటున్న ఓ కుటుంబాన్ని కొందరు దారుణంగా హతమార్చిన కేసు మీద ధీరజ్ దృష్టి పడుతుంది. ఈ కేసు తవ్వుకుంటూ వెళ్లేకొద్దీ దాని వెనుక రాజస్థాన్ నుంచి వచ్చిన ఓ దొంగల ముఠా ఉంటుందని తెలుస్తుంది. ఆ ముఠా ఎంత దారుణంగా అమాయకులను పొట్టనబెట్టుకుంటుందో తెలిసాక ధీరజ్ వారిని పట్టుకునే పనిలో పడతాడు. ఆ పని పూర్తి చేయడానికి ఏడాదిన్నర పడుతుంది. ఈ టైం లో ధీరజ్ కి ఆ దొంగల ముఠా నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురు అవుతుంది. దాన్నుంచి ధీరజ్ ఎలా బయటపడ్డాడు అన్నదే మిగిలిన కథ.

విశ్లేషణ…

దర్శకుడు వినోద్ ఓ మంచి క్రైమ్ థ్రిల్లర్ కథ సమకూర్చుకున్నాడు.దొంగల కోసం పోలీస్ అధికారి వేట కథలతో ఎన్నో సినిమాలు వచ్చినా ఈ సినిమాలో ఎప్పుడో వదిలేసిన క్రైమ్ వెనుక వున్న వారిని పట్టుకోవడం కొత్తగా అనిపిస్తుంది. దండుపాళ్యం, ఘర్షణ లాంటి సినిమాలు అక్కడక్కడా గుర్తుకు వచ్చినా కధనంలో పడి వాటిని పెద్దగా పట్టించుకోము.ఇలాంటి క్రైమ్ కధలకి మధ్యలో రొమాంటిక్ సీన్స్ రావడం పంటి కింద రాళ్లు పడ్డట్టు అనిపించినా దాని వెనుక ఉద్దేశం కధలో తర్వాత తెలుస్తుంది. మొత్తానికి క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవాళ్ళకు ఖాకీ బాగా నచ్చుతుంది. దర్శకుడు ఈ సినిమా కథను కేవలం హీరో, విలన్ కోణం నుంచి కాకుండా క్రిమినల్, పోలీస్ మనస్థత్వాల కోణంలో తీయడం విశేషం. నిజాయితీ కల అధికారి కి ఓ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఎన్ని ఇబ్బందులు ఎదురు అవుతాయి ? . ఓ క్రిమినల్ ఎంత క్రూరంగా ఆలోచిస్తాడో అన్న పాయింట్స్ ని బాగా హైలైట్ చేయగలిగాడు. కార్తీ ని యాంగ్రీ యంగ్ మెన్ గా చూపడంలో దర్శకుడు వినోద్ సక్సెస్ అయ్యాడు. ఇన్నాళ్లు కార్తీని లవర్ బాయ్ పాత్రల్లో చూసిన జనానికి ఈ సినిమా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. రకుల్ ప్రీత్ సింగ్, అభిమన్యు సింగ్ తమ పాత్రలకు ప్రాణం పోశారు.

ప్లస్ పాయింట్స్ …
కధనం
దర్శకత్వం
హీరో
విలన్

మైనస్ పాయింట్స్ …

అక్కడక్కడా సాగదీత.
మరీ వాస్తవిక దృశ్యాలు

తెలుగు బులెట్ పంచ్ లైన్…”ఖాకీ “కష్టాలు ఆలా ఉంటాయి మరి.
తెలుగు బులెట్ రేటింగ్…3 / 5.