సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఖలేజా చిత్రం కి నేడు పదేళ్లు పూర్తి అయింది. ఈ మేరకు సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేశారు. ఖలేజా చిత్రం విడుదల అయి పదేళ్లు అవుతోంది అని, ఒక నటుడిగా నన్ను నేను ఆవిష్కరించుకున్న చిత్రం అది అని మహేష్ బాబు అన్నారు. తన కెరీర్ లో ఇదే ప్రత్యేక మైన చిత్రం అంటూ మహేష్ చెప్పుకొచ్చారు. నాకు మంచి స్నేహితుడు అయిన త్రివిక్రమ్ కి ధన్యవాదాలు అని మహేష్ బాబు అన్నారు. మన తదుపరి చిత్రం కోసం ఆసక్తి గా ఎదురు చూస్తున్నా అంటూ మహేష్ త్రివిక్రం శ్రీనివాస్ ను ఉద్దేశిస్తూ తెలిపారు.
అయితే త్రివిక్రం శ్రీనివాస్ తో సినిమా చేసేందుకు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే త్రివిక్రం కొసం మహేష్ ఎటువంటి స్క్రిప్ట్ తో ముందుకు వస్తారో చూడాలి. కమర్షియల్ హిట్స్ గా సక్సెస్ కానీ ఖలేజా, బుల్లి తెర పై మాత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రం లో నటిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తర్వాత చిత్రం కోసం స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నారు. గతంలో మహేష్ త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా చిత్రాలు ప్రేక్షకులను, అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.