Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Khammam District congress leader Playing Key Role In T Congress
తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఓ లీడర్ ను చూస్తే ఆమడదూరం పారిపోతున్నారు. అసలు ఆయన కనిపిస్తేనే ఏం అడుగుతారో అని పీసీసీ చీఫ్, సీఎల్పీ నేత కూడా భయపడుతున్నారట. రాహుల్ గాంధీకి కూడా సాధ్యంకాని భయభక్తులు ఆయనకు సాధ్యమౌతున్నాయి. ఆయనే ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న ఖమ్మం జిల్లాకు చెందిన నేత. యూత్ కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్న ఆయన.. ఇప్పుడు ఉత్తమ్, జానాలకే క్లాస్ పీకుతున్నారట.
ఉత్తమ్ కంటే ఆయన సీనియర్ కాబట్టి ఏమీ అనలేరు. జానా వయసు, పదవుల విషయంలో సీనియర్ అయినా.. కాంగ్రెస్ లో మాత్రం సదరు నేత కంటే జూనియరే. అందుకే ఆయన కూడా మారు మాట్లాలకేపోతున్నారు. అసలు సీఎల్పీ ఎంత దూకుడుగా ఉండాలని, పీసీసీ ఎంతగా కార్యకర్తలతో మమేకం కావాలి.. మీరేం చేస్తున్నారంటూ మండిపడుతున్నారట సదరు నేత. దీంతో జానా, ఉత్తమ్ కు చెమటలు పడుతున్నాయట.
అసలు సదరు నేత అంటే ఎందుకంత భయం అంటే.. ఆయన ఏం చెప్పినా అధిష్ఠానం ప్రామాణికంగా తీసుకుంటుందనే అనుభవం వారికి ఉంది. గతంలో విభజన సందర్భంలో కూడా ఎక్కువగా ఆయన మాటకే విలువ దక్కిందట. ఇప్పటికీ ఏఐసీసీ సీనియర్లందరితోనూ ఆయనకు సత్సంబంధాలున్నాయి. అందుకే ఆయన అడిగిన సమాచారం ఇవ్వకపోతే.. ఎక్కడ కొంప మునుగుతుందోనని భయపడుతున్నారు కాంగ్రెస్ నేతలు.
మరిన్ని వార్తాలు:
రాష్ట్రపతి ఎన్నికల్లో నితీష్ లెక్కేంటి..?