రంజాన్ స్పెషల్ : ఖర్జూర హల్వా ఇంట్లో చేసుకొండిలా

kharjooram halwa recipe

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రంజాన్ వచ్చేసింది. ముస్లిం లు ఎంత మాంసాహార ప్రియులో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కానీ రంజాన్ నెలలో ఖర్జూరంతో లేదా నీటితో ఉపవాసం విరమించటం మహమ్మద్ దినచర్యగా ఉండేది, అదే అనవాయితీ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ముస్లీంలు అనుసరిస్తున్నారు. కానీ రోజూ ఒట్టిది తింటే ఏమి బాగుంటుంది అందుకే ఈ నెలలో ముస్లీంలు ఇష్టపడే తినే ఖర్జూరంతో హల్వా చేయడం ఎలాగో చూద్దాం.
కావలసిన పదార్ధాలు:
ఖర్జూరం: పావు కేజీ
పాలు: 3 కప్పులు
పంచదార: పావు కేజీ
బాదంపలుకులు: అర కప్పు
జీడిపప్పు: పావు కప్పు
కిస్‌మిస్‌లు: పావు కప్పు
యాలకుల పొడి : ఒక టేబుల్ స్పూన్
నెయ్యి: 3 టీ స్పూన్లు
తయారీ విధానం :
ముందుగా బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌లను నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకుని ఖర్జూరాల్లో గింజలను తొలగించి పాలలో వేసి చిన్న మంటపై ఉడికించుకోవాలి. అవి ఉడికాక ఖర్జూరాలు మెత్తగా అయ్యాక పంచదార, నెయ్యి జోడించి మూత పెట్టాలి. ఈ మిశ్రమం అడుగంటకుండా గరిటతో కలియబెడుతూ ఉండాలి. ఈ మిశ్రమం కొంచెం చిక్కగా అయ్యాక యాలకుల పొడి వేసుకోవాలి. తరువాత నేతిలో వేయించిన బాదం, కిస్‌మిస్‌లను వాటి మీద వార్నిష్ చేసుకోవాలి. అంతే.. ఖర్జూర స్వీట్‌ హాల్వా రెడీ.