ఆర్‌ మల్టీస్టారర్‌లో సీఎం లవర్‌

Kiara Advani To Play The Lead In Imtiaz Ali Love Aaj Kal 2

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోతున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రానికి రంగం సిద్దం అవుతుంది. ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చిన ఈ చిత్రంలో హీరోయిన్స్‌ విషయమై గత కొంత కాలంగా చర్చ జరుగుతుంది. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు ఈ చిత్రంలో హీరోలుగా నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ చిత్రంను తెలుగుతో పాటు బాలీవుడ్‌, కోలీవుడ్‌లో కూడా విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు రాజమౌళి ఉన్నాడు. అందుకే పలువురు ప్రముఖ స్టార్స్‌ను ఈ చిత్రం కోసం ఎంపిక చేయాలనే నిర్ణయానికి దర్శకుడు వచ్చాడు. అందులో భాగంగానే హీరోయిన్స్‌ను బాలీవుడ్‌ నుండి దిగుమతి చేసుకోవాలని నిర్ణయించాడు.

‘భరత్‌ అనే నేను’ చిత్రంతో హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకున్న కైరా అద్వానీని మల్టీస్టారర్‌ చిత్రంలో ఒక హీరోయిన్‌గా ఎంపిక చేయడం దాదాపు ఖరారు అయ్యింది. అతి త్వరలోనే ఈ విషయమై చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మరో హీరోయిన్‌ను సైతం బాలీవుడ్‌ నుండి ఎంపిక చేస్తారని తెలుస్తోంది. కైరా అద్వానీ ఎన్టీఆర్‌కు జోడీగా నటించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రామ్‌ చరణ్‌తో కైరా అద్వానీ ఒక చిత్రాన్ని చేస్తుంది. వెంట వెంటనే రెండు చిత్రాలు అంటే కాస్త బోరింగ్‌గా ఉండే అవకాశం ఉంది. అందుకే జక్కన్న ఆలోచించి ఎన్టీఆర్‌కు కైరా అద్వానీని సెట్‌ చేస్తాడని సమాచారం అందుతుంది. భారీ అంచనాల నడుమ రూపొందబోతున్న ఈ మల్టీస్టారర్‌ చిత్రంను అక్టోబర్‌ లేదా సెప్టెంబర్‌లో సెట్స్‌ పైకి తీసుకు వెళ్లబోతున్నారు.