హీరోకు సారీ చెప్పింది

sai pallavi say sorry to naga shourya at kanam movie

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

 

‘ఛలో’ సినిమా ప్రమోషన్‌ సమయంలో సాయి పల్లవిపై తీవ్ర స్థాయిలో నాగశౌర్య విమర్శలు చేసిన విషయం తెల్సిందే. సాయి పల్లవితో తాను చేసిన ‘కణం’ చిత్రం షూటింగ్‌ సమయంలో ఆమె వ్యవహరించిన తీరు బాగాలేదని, ఆమె దురుసుగా ప్రవర్తించేదని, మాట్లాడినా మాట్లాడేది కాదు అంటూ నాగశౌర్య చెప్పుకొచ్చాడు. తాజాగా ఆ విషయమై సాయి పల్లవి క్లారిటీ ఇచ్చింది. అతిగా మాట్లాడటం తన పద్దతి కాదని, నాగశౌర్య తన పనేదో తాను చూసుకుంటూ వెళ్లేవాడని, తాను కూడా అలాగే చేసేదాన్ని అని, అందువల్ల ఇద్దరి మద్య గ్యాప్‌ ఏర్పడటం జరిగిందని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన ‘కణం’ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది.

తాజాగా సాయి పల్లవి మీడియాతో మాట్లాడిన సందర్బంగా నాగశౌర్య విషయమై స్పందించింది. నాగశౌర్యకు ఇబ్బంది కలిగించి ఉన్నట్లయితే సారి అని, ఆయన సైలెంట్‌గా ఉండేవాడు, ఆయన్ను డిస్ట్రబ్‌ చేయడం ఇష్టం లేకే తాను ఆయనతో మాట్లాడక పోయేది అంటూ చెప్పుకొచ్చింది. ‘కణం’ చిత్రం డబ్బింగ్‌ సమయంలో నాగశౌర్యతో మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు అంటూ సాయి పల్లవి చెప్పుకొచ్చాడు. నా ప్రవర్తన వల్ల నాగశౌర్య ఇబ్బంది పడి ఉంటే క్షమాపణలు చెబుతున్నాను అంటూ ఈ వివాదానికి ఫుల్‌ స్టాప్‌ పెట్టేందుకు సాయి పల్లవి ప్రయత్నించింది. మరి ఇప్పటికైనా నాగశౌర్య ఈ విషయమై స్పందిస్తాడో చూడాలి.