కియారాకు ప్రభాస్ సినిమాలో అవకాశం

కియారాకు ప్రభాస్ సినిమాలో అవకాశం

ప్రభాస్ తో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తీసే సూపర్ హీరో సినిమా కోసం భారీ సెటప్ ప్లాన్ చేస్తున్నారు వైజయంతి మూవీస్ అధినేత అశ్వని దత్. ఈ చిత్రంలో పాన్ ఇండియా అప్పీల్ ఉన్న నాయిక ఉండాలని అశ్విన్ ట్రై చేస్తున్నాడు. దీపికా పదుకోన్ ని సంప్రదించారు కాని ఆమె ఇంకా సమ్మతం చెప్పలేదు.

ఆమె డేట్స్ పరంగా చిక్కులు ఉండే అవకాశం కూడా ఉందట. అందుకే ఎన్ని కాల్షీట్స్ అయినా ఇచ్చే హీరోయిన్ కోసం అశ్విన్ చూస్తున్నాడు. కియారా అద్వానీ పేరు పరిశీలనలో ఉందని, ఆమెకు కూడా కబీర్ సింగ్ వల్ల దేశ వ్యాపితంగా యువతలో క్రేజ్ ఉంది కనుక ఆమె అయినా బెస్ట్ ఆప్షన్ అని భావిస్తున్నాడట.

నిజంగా ఈ సినిమాలో అవకాశం కియారాకు వెళితే ఆమె రేంజ్ మరింత పెరుగుతుంది. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమైందనే లోటు కూడా తీరిపోతుంది. రాధే శ్యామ్ షూటింగ్ వేసవి లోగా పూర్తి చేసి ఆ తర్వాత డిలే లేకుండా దీనికి డేట్స్ ఇస్తానని ప్రభాస్ మాట ఇవ్వడంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని అశ్విన్ వేగవంతం చేసాడు.