ప్రిన్స్‌ ఆండ్రూ పెద్ద కుమార్తె ప్రిన్సెస్‌ బీట్రెస్ వివాహం

ప్రిన్స్‌ ఆండ్రూ పెద్ద కుమార్తె ప్రిన్సెస్‌ బీట్రెస్ వివాహం

ప్రిన్స్‌ ఆండ్రూ పెద్ద కుమార్తె ప్రిన్సెస్‌ బీట్రెస్‌(31) వివాహం శుక్రవారం ఓ వ్యాపారవేత్తతో జరిగింది. బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 మనవరాలు అయిన బ్రీట్రెస్‌ ఇటలీకి చెందిన మాపెల్లి మొజ్జిని(37) పెళ్లి చేసుకున్నారు. కరోనా వైరస్‌ కరాణంగా వీరి వివాహం నిరాడంబరంగా జరిగినట్లు బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ వర్గాలు ధృవీకరించాయి.

అయితే ప్రిన్సెస్‌ బ్రీట్రెస్‌, మాపెల్లిల పెళ్లి మొదటగా మే 29న లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో వీరి వివాహం వాయిదా పడింది. అనంతరం జూలై 17న శుక్రవారం ఉదయం 11 గంటలకు విండ్సర్లోని రాయల్ లాడ్జ్‌లోని రాయల్ చాపెల్ ఆఫ్ ఆల్ సెయింట్స్ వద్ద వీరి వివాహం జరిగినట్లు రాజ కుటుంబం ఓ ప్రకటలో తెలిపింది. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది.