చదువు ఇష్టం లేక బాలిక ఆత్మహత్య

చదువు ఇష్టం లేక బాలిక ఆత్మహత్య

ఇంటర్‌ చదవడం ఇష్టం లేక ఓ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. మండల పరిధిలోని ఎం.అగ్రహారం గ్రామంలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. మృతురాలు విజయలక్ష్మి (16) ఎం. అగ్రహారం గ్రామంలోని అవ్వాతాతల వద్ద ఉండి చదువుకుంటుంది.

తల్లిదండ్రులు నాగవేణి, శంకర్‌ హైదరాబాద్‌లో ఉంటారు. ఈ ఏడాది పదవతరగతి పూర్తికావడంతో ఇంటర్‌కు దరఖాస్తు చేసుకోవాలని కుమార్తెకు చెప్పారు. ఉన్నత విద్య అభ్యసించడం ఇష్టం లేని ఆ బాలిక శుక్రవారం ఇంట్లో ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించేలోపు మృతిచెందింది. ఈమేరకు తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు మద్దికెర పోలీసులు తెలిపారు.