దీని కోసం గర్భిణిని చంపేశాడా ….. మానవ మృగం

కర్ణాటకలో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. కేవలం బట్టలు ఉతకలేదన్న కారణంగా నిండు గర్భిణీని ఆమె బావ కత్తితో పొడిచి చంపేశాడు. ఈ దుర్ఘటన శిడ్లఘట్ట తాలూకాలోని దిబ్బూరుహళ్ళి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న ఆనేమడుగు గ్రామంలో జరిగింది. అయితే ఆ గ్రామానికి చెందిన నవీన్‌చంద్రకు కొంతకాలం నాగజ్యోతి అనే యువతితో వివాహమైంది. అన్న హరీశ్‌కుమార్ కుటుంబంతో కలిసి నవీన్ చంద్ర కూడా ఒకే ఇంట్లో ఉండేవాడు. అయితే నాగజ్యోతి గర్భం దాల్చింది. ఆమెకు సీమంతం చేయాలని కుటుంబసభ్యులు కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో భర్త బుధవారం నాగజ్యోతికి బట్టలు కొనేందుకు పట్టణానికి వెళ్లాడు.

అయితే అదే సమయంలో మధ్యాహ్నం ఇంట్లో టీవీ చూస్తున్న నాగజ్యోతిని బట్టలు ఉతకాలని బావ హరీశ్‌కుమార్ కోరాడు. అయితే తనకు కాస్త నీరసంగా ఉందని.. ఉతకలేనని ఆమె చెప్పింగి. దీంతో ఆగ్రహానికి గురైన హరీష్ కుమార్.. ఆమెపై ఏకంగా కత్తి తీసుకుని అతి కిరాతకంగా పొడిచాడు. దీంతో నాగజ్యోతి పెద్దగా కేకలు పెట్టింది. అది ఈ విషయంపై సమాచారం అందుకున్న దిబ్బూరుహళ్ళి పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. కాగా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.