KING KOHLI RECORDS: ప్రపంచ కప్ అత్యధిక పరుగుల ప్లేయర్స్ జాబితాలో కోహ్లీ 4వ స్థానం… !

KING KOHLI RECORDS: Kohli is 4th in the list of players with the most runs in the World Cup... !
KING KOHLI RECORDS: Kohli is 4th in the list of players with the most runs in the World Cup... !

ప్రపంచ కప్ లలో ఇప్పటి వరకు ఎన్నో రికార్డులు క్రియేట్ అయ్యి, అందులో ఎన్నో రికార్డులు బ్రేక్ అయ్యాయి. కాగా తాజాగా జరుగుతున్న ప్రపంచ కప్ లో చాలా రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. ఇక నిన్న న్యూజిలాండ్ మరియు ఇండియా ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఛేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటి వరకు ప్రపంచ కప్ మ్యాచ్ లలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్స్ జాబితాలో ఏకంగా నాలుగవ స్థానానికి చేరుకున్నాడు.

నిన్నటి వరకు సచిన్ టెండూల్కర్ (18426), కుమార సంగక్కర (14234), రికీ పాంటింగ్ (13704), సనత్ జయసూర్య (13437) లు ఉన్నారు. కానీ నిన్నటి మ్యాచ్ లో కోహ్లీ 95 పరుగులు చేయడంతో మొత్తం వరల్డ్ కప్ లో 13437 పరుగులతో సనత్ జయసూర్యను అధిగమించి నాలుగవ స్థానానికి చేరుకున్నాడు.ఇక మిగిలిన మ్యాచ్ లలో ఇదే తరహాలో ఆడితే మూడవ స్థానానికి చేరుకోవడం చాలా ఈజీ అంటూ క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.