ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం ఎవరిని కదిపినా రాజధాని గురించే మాట్లాడుతున్నారు. జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం ఒక్క వైసీపీ మినహా మిగతా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఇటీవలే కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అనంతపురం పర్యటనలో వున్న కిషన్ రెడ్డి మరొకసారి రాజధాని గురించి ఆసక్తికర విషయాలని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేసారు. అంతేకాకుండా ఆంధ్ర ప్రదేశ్ రాజధాని విషయం లో మేము జోక్యం చేసుకోమని తెలిపారు. అయితే నివేదిక వచ్చిన తర్వాత రాజధాని అంశం ఫై స్పందిస్తామని అన్నారు. పార్టీ అభిప్రాయాలకు, ప్రభుత్వ నిర్ణయాలకు చాల వ్యత్యాసం ఉంటుందని అన్నారు.