రాజధానిని తరలిస్తున్నారన్న నేపథ్యం లో అమరావతి ప్రాంత రైతులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే అమరావతి రైతులు మరియు ఐకాస నేతలు ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ని కలవడం జరిగింది. అయితే ఈ సందర్భంగా రైతులు చాల నష్టపోతున్నారని కేంద్ర మంత్రి కి ఐకాస నేతలు విన్నవించుకున్నారు. అయితే ఆందోళనకారుల పైన రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆందోళన కారుల ఫై రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని, రాజధాని విషయం లో కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ తెలియజేయడం జరిగింది.
అయితే వారి వ్యాఖ్యలకి స్పందించిన మంత్రి కిషన్ రెడ్డి, పలు కీలక వ్యాఖ్యలు చేసారు. మూడు రాజధానుల అంశం ఫై వైసీపీ ప్రభుత్వం ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలిపింది. అయితే కేంద్రానికి లిఖిత పూర్వకంగా అందిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం తో మాట్లాడతామని కిషన్ రెడ్డి అన్నారు. అయితే రాజ్యాంగ పరిధిలోనే కేంద్రం వ్యవహరిస్తుందని స్పష్టం చేసారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమైనా కొన్ని సూచనలు చేస్తాం అని కిషన్ రెడ్డి అన్నారు. అయితే అభివృద్ధి వికేంద్రీకరణ మంచిదే అయినప్పటికీ రాజధాని మార్పు మంచిది కాదని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర బీజేపీ మూడు రాజధానుల వద్దని చెప్పిందని కిషన్ రెడ్డి మీడియా తో తెలియజేసారు.