ముద్దొస్తున్న స్మార్ట్ ఫోన్…

kiss
Posted [relativedate]
kissinger app in smartphoneటెక్నాలజీతో సాధ్యం కానిది ఏదీ లేదు . ల్యాండ్ ఫోన్ నుంచి వీడియో కాలింగ్ వరకు వృద్ధి చెందిన ఈ రంగంలో మరో ముందడుగు పడింది. స్మార్ట్ ఫోన్ ద్వారా ఇకపై మెసేజ్, మెయిల్స్ మాత్రమే కాదు ముద్దులు కూడా పంపించుకోవచ్చు. ఇందుకోసం కిసెంజర్ అనే ఒక పరికరాన్ని తయారు చేశారు లండన్ యూనివర్సిటీ పరిశోధకులు.
               స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత మనుషుల మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించేందుకు… సరికొత్త పరికరాన్ని కనుగొన్నారట. దూరంగా ఉంటున్న ప్రేమికులు, భార్యాభర్తలు కిస్ చేసుకునేలా… కిసెంజర్ అనే పరికరాన్ని తయారు చేశారు. యాప్ ఆధారంగా సెన్సర్లు, అక్యుయేటర్స్‌ తో ఇది పనిచేస్తుంది. ఒక వ్యక్తి నేరుగా ముద్దు పెట్టుకొంటే ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో అలాంటి భావనే ఈ స్మార్ట్‌ ఫోన్ కలిగిస్తుంది. ముద్దు పెట్టుకోవడానికి వీలుగా స్మార్ట్‌ ఫోన్‌పై సిలికాన్‌తో ప్రత్యేకంగా బటన్ లాంటి ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. దీంతో అవతలి వ్యక్తిని ముద్దు పెట్టుకోవడానికి వీలుంటుంది. ఒరిజినల్ ముద్దుకు ఏమాత్రం తీసిపోకుండా ఇది ఉంటుందట.
           కుటుంబ సభ్యులను, ఇష్టమైన వారిని మిస్ అవుతన్న వారి మధ్య అనుబంధాలు మరింత పెంచేందుకు ఈ పరికరాన్ని తయారు చేశారు. మూడేళ్లుగా దీని కోసం లండన్ యూనివర్సిటీ పరిశోధకలు శ్రమించారు. దీన్ని ఆరు నెలలుగా వివిధ దశల్లో టెస్ట్ చేశారట. ఈ ప్రయోగాలన్నీ మంచి ఫలితాల్ని ఇవ్వడంతో… త్వరలోనే మార్కెట్ లోకి విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.