దక్షిణాఫ్రికాతో జరిగిన అఖరి వన్డే లోను ఓటమి చెంది టీమిండియా ఘోర పరాభావం పొందింది. కేప్‌టౌన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్‌పై నాలుగు పరుగుల తేడాతో ప్రోటిస్ విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో అతిథ్య జట్టు క్లీన్ స్వీప్ చేసింది. ఇక టీమిండియా రెగ్యూలర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన సంగతి తెలిసిందే.
రోహిత్ గైర్హజరీలో కెప్టెన్‌గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. కెప్టెన్‌గా మెదటి మూడు వన్డేల్లో ఓడిన తొలి భారత ఆటగాడిగా రాహుల్ నిలిచాడు. కాగా ఇప్పటి వరకు ఏ భారత కెప్టెన్ తన తొలి మూడు వన్డేలు ఓడిపోలేదు. ఇక ఈ సిరీస్‌లో కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గా కూడా రాహుల్ విఫలమయ్యాడు.