ప్రేయసితో ఇంగ్లండ్‌ వెళ్ళిన కేఎల్‌ రాహుల్‌

ప్రేయసితో ఇంగ్లండ్‌ వెళ్ళిన కేఎల్‌ రాహుల్‌

టీమిండియా క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌తో బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కూతురు అతియా శెట్టి కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాహుల్‌ ఈ విషయాన్ని బహిరంగంగా ఎక్కడా చెప్పకపోయినా.. అతియా మాత్రం తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్‌తో కలిసి దిగిన ఫోటోలు షేర్‌ చేస్తూ వచ్చింది. ఐసీసీ ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌తో పాటు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ఆడేందుకు కేఎల్‌ రాహుల్‌ ఇంగ్లండ్‌కు వచ్చిన సంగతి తెలిసిందే.

అతియా తాజాగా రిలీజ్‌ చేసిన ఒక ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కొన్ని రోజలు క్రితం మార్నింగ్‌ కాఫీ తాగుతూ సేద తీరుతున్నా అంటూ రాహుల్‌ తన ఇన్‌స్టాలో ఒక ఫోటో షేర్‌ చేశాడు. తాజాగా అతియా కూడా అదే బ్యాక్‌గ్రౌండ్‌లో దిగిన ఒక ఫోటోను షేర్‌ చేసింది. కానీ ఆమె పెట్టిన ఫోటోలో రాహుల్‌ కనిపించలేదు. ఫోటో మాత్రం అదే బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండడంతో రాహుల్‌తో కలిసి అతియా ఇంగ్లండ్‌కు వచ్చిందా అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇక కేఎల్‌ రాహుల్‌ ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఆడుతుండగానే తీవ్ర కడుపునొప్పితో మధ్యలోనే వైదొలిగాడు. వైద్యులు అతన్ని పరీక్షించి అపెండిసైటిస్ శస్త్రచికిత్స నిర్వహించారు. ఇటీవలే దాని నుంచి కోలుకున్న రాహుల్‌ను డబ్ల్యూటీసీ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాహుల్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా కనిపిస్తుంది. ఇక జూన్‌ 18 నుంచి 22 వరకు కివీస్‌, టీమిండియాల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరగనుంది. అనంతరం ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్‌ 14 వరకు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది.