వరద నష్టాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే స్పందించారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ, ముమ్మరంగా సహాయ చర్యలు చేపడుతున్నామన్నారు. సీఎం ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారన్నారు. చంద్రబాబు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
భార్యను రోడ్డు మీదకు తెచ్చిన ఘనత చంద్రబాబుదే. ఆయన రాజకీయ వ్యభిచారిగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ‘‘రాజకీయ అవసరాల కోసం భార్యను రోడ్డు మీదకు తేవడం అన్యాయం. చంద్రబాబు మాదిరిగానే లోకేష్ వ్యవహరిస్తున్నారు. ఏదోలా రాజకీయ లబ్ధి పొందాలని చంద్రబాబు తాపత్రయం.
చంద్రబాబు బుద్ధి, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. అసెంబ్లీ వదిలేసి కుంటిసాకులతో బయటకెళ్లిపోయారు. చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసి భువనేశ్వరి పరువు దిగజార్చారు. వరదల్లో బాధితుల పరామర్శకు వెళ్లి.. నన్ను అవమానించారంటూ చంద్రబాబు ఏడుస్తున్నారని’’ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు.