తీవ్ర అనారోగ్యంతో మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిని కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో ముంబైకి తరలించారు. అనారోగ్యంతో ఐదు రోజుల క్రితం ఆయన హైదరాబాద్ AIG ఆస్పత్రిలో చేరారు. అయితే.. ఆయనకు గుండెలోనూ సమస్య ఉన్నట్లు తేల్చారు వైద్యులు. మూడు రక్తనాళాల్లో బ్లాక్‌లు ఉండడంతో సర్జరీ చేయాలని సూచించారు. గుండెకు సంబంధించిన మూడు వాల్వ్స్ మూసుకుపోగా సర్జరీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే.. హార్ట్ సర్జరీ చేసేందుకు కొడాలి ఆరోగ్యం సహకరించకపోవడంతో కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో ముగ్గురు డాక్టర్ల పర్యవేక్షణలో హైదరాబాద్ నుంచి ముంబైకి తీసుకెళ్లారు.