Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
- 6వ విడత అమరుల స్ఫూర్తి యాత్రకు పోలీసు అనుమతి కోరాం. మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. యాత్ర మొదలైన తర్వాత అనుమతి తీసుకొచ్చేందుకు వెళ్లాల్సిన వ్యక్తిని గృహనిర్భంధం చేశారు.
- యాత్రపై ఆఖరు నిమిషంలో పోలీసులు మనసు మార్చుకున్నారు.
అర్ధరాత్రి నుంచే ఐకాస నేతల అరెస్టులు ప్రారంభించారు. వరంగల్ 300, హైదరాబాద్ లో 110 మందిని, మొత్తం 400 మందిని అరెస్టు చేశారు. - అరెస్టు చేసిన తర్వాత పోలీసు స్చేషన్ లో పుట్టుమచ్చలతోపాటు కులం పేరు అడిగారు.
- కులం అడిగే సంప్రదాయం అనాగరికమైనది. ఇది మారాలి.
అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులు తమను గుర్తుపట్టడానికి అనుకూలమైన రీతిలో యూనిఫాం ధరించాలి. కానీ ఆ నిబంధనలు పాటించకుండా… సివిల్ దుస్తుల్లో వచ్చారు. ఇది సరికాదు. - సెక్షన్ 151 కింద అరెస్టు చేయడం అన్యాయం. మానభంగాలు, దొమ్మీల వంటి కాగ్నిజబుల్ నేరం జరిగే అవకాశం ఉందనుకున్నప్పుడే వేర ఇతర మార్గాలు లేనప్పుడు మాత్రమే సెక్షన్ 151 వర్తిస్తుంది.
- కానీ మాకార్యక్రమం గురించి ప్రభుత్వానికి , పోలీసులకు ముందే వెల్లఢించాం.
ఈ ప్రభుత్వం బలహీనపడుతోంది. మమ్మల్నిచూసి భయపడుతోంది.
ప్రభుత్వ చేతగానితనం వల్లే మమ్మల్ని అరెస్టు చేశారు. నిన్నటి సంఘటనలతో మా సంకల్పం మరింత బలపడింది. - అన్ని పార్టీలకు నిన్నటి పరిణామాలు వివరిస్తాం, గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం. కోర్టుకు కూడా వెళ్తాం.
- ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది.
- నల్గొండలో 21, 22 లో 7వ విడత అమరుల స్ఫూర్తి యాత్ర నిర్వహిస్తాం. ఇప్పటికే ధరఖాస్తు కూడా పెట్టుకున్నాం. అనుమతి మంజూరు చేయాలని కోరుతున్నాం.
- నిరుద్యోగులందరికీ ఏ ప్రబుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు. రాష్ట్రంలో 2లక్షలు ఖాళీలున్నాయి. వాటిని వెంటనే భర్తీ చేయాలి.
ఉద్యోగాలు రావడంలేదని ఇప్పటికే ఇద్దరు యువకులు ఆక్మహత్య చేసుకున్నారు. - సుప్రీంకోర్టు తీర్పు స్ఫూర్తితో సమానపనికి సమాన వేతనం ఇవ్వాలి.
- నిరుద్యోగులకు ఉద్యోగమైనా ఇవ్వాలి. లేదంటే నిరుద్యోగ బృతి ఐనా ప్రకటించాలి.
- మేం లేవనెత్తిన 6 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలి.
- సమాజంలో రాజకీయాలు అనివార్యం. అవి బాగాలేనప్పుడు సరిచేసుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది.
ప్రజాస్వామ్యంలో పౌరులను చైతన్యవంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మాపై ఉంది.
మాకు వెనక్కిమళ్లే దారిలేదు. ఆరునూరైనా మా ప్రయాణం ముందుకే సాగుతుంది. - రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి పోరాడాం. ఈ ప్రభుత్వం మాది. ప్రజల హక్కులకోసం కొట్లాడే హక్కు మాకు ఉంది.