బెంగాలీ న‌టి కుటుంబ‌ స‌భ్యులంద‌రికీ క‌రోనా పాజిటివ్‌

బెంగాలీ న‌టి కుటుంబ‌ స‌భ్యులంద‌రికీ క‌రోనా పాజిటివ్‌

సామాన్యుల ద‌గ్గ‌ర నుంచి ప్ర‌ముఖుల వ‌ర‌కు ఎంతోమంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. తాజాగా బెంగాలీ న‌టి కోయ‌ల్ మ‌ల్లిక్ తో స‌హా ఆమె కుటుంబ‌ స‌భ్యులంద‌రికీ క‌రోనా పాజిటివ్‌గా నిర్దార‌ణ అయ్యింది. కోయ‌ల్ తండ్రి ప్ర‌ముఖ బెంగాలీ న‌టుడు రంజిత్ మల్లిక్, తల్లి దీపా మల్లిక్, భర్త, నిర్మాత నిస్పాల్ సింగ్ స‌హా కుటుంబం మొత్తం క‌రోనా బారిన‌ప‌డినట్లు స్వ‌యంగా న‌టి కోయ‌ల్ మ‌ల్లిక్ ట్విట‌ర్ ద్వారా వెల్లడించారు. ప్ర‌స్తుతం అంద‌రూ సెల్ప్ క్వారంటైన్‌లో ఉన్నామ‌ని తెలిపారు.

‘ఘోరే అండ్ బైరే’, ‘ఛాయా ఓ ఛాబీ’ వంటి చిత్రాలతో కోయల్‌ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. 2013లో నిర్మాత నిస్పాల్ సింగ్‌ని పెళ్లి చేసుకోగా ఈ ఏడాది మే నెల‌లోనే ఈ దంపతులకు బాబు పుట్టాడు. ఈ విషయాన్ని అభిమానుల‌తో పంచుకొని ఎంతో సంబంర‌ప‌డింది ఈ జంట‌. కాగా కొద్ది నెలల వ్య‌ధిలోనే కుటుంబం మొత్తానికి క‌రోనా సోక‌డంపై ప‌లువురు ప్ర‌ముఖులు ఆందోళ‌న చెందుతున్నారు.

దర్శక నిర్మాత సత్యజిత్ సేన్, నటులు విక్రమ్ ఛటర్జీ, జీత్ స‌హా ప‌లువురు బెంగాలీ న‌టులు కోయ‌ల్ కుటుంబం కోవిడ్ నుంచి త్వ‌ర‌గా కోలుకొవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. గ‌తేడాది మొద‌టిసారి వూహాన్‌లో బ‌య‌ట‌ప‌డ్డ క‌రోనా వైరస్ దాదాపు అన్ని దేశాల‌కు వ్యాపించింది. ఇప్ప‌టికే టామ్ హాంక్స్ కిరణ్ కుమార్, జోవా మొరాని, గాయని కనికా కపూర్ స‌హా ప‌లువురు ప్ర‌ముఖుల‌కు క‌రోనా సోకిన సంగ‌తి తెలిసిందే.