అమితాబ్‌ ,అభిషేక్‌లకు కోవిడ్‌ పాజిటివ్ గా నిర్ధారణ

అమితాబ్‌ ,అభిషేక్‌లకు కోవిడ్‌ పాజిటివ్ గా నిర్ధారణ

బాలీవుడ్‌ బాద్‌షా అమితాబ్‌ బచ్చన్‌ కు, ఆయన కుమారుడు అభిషేక్‌కు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శనివారం సాయంత్రం అమితాబ్‌ బచ్చన్‌ ముంబైలోని నానావతి ఆస్పత్రిలోని రెస్పి రేటరీ ఐసోలేషన్‌ యూనిట్‌లో చేరారు. అంతకు ముందు అమితాబ్‌ ట్విట్టర్‌లో.. ‘నాకు కోవిడ్‌ పాజిటివ్‌ అని తేలింది. ఆస్పత్రిలో చేరాను. ఆస్పత్రి అధికారులు నాతోపాటు మా కుటుంబ సభ్యులు, సిబ్బందికి కూడా పరీక్షలు చేయించారు. వారికి సంబం ధించిన ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది’ అని అందులో వివరించారు. ‘గత 10 రోజులుగా నాతో సన్నిహి తంగా మెలిగిన వారిని కూడా కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నాను’ అని అందులో తెలిపారు.

కోవిడ్‌ లక్షణా లతో అమితాబ్‌ ఆస్పత్రిలో చేరారనీ, అంతకు ముందు నుంచే అమితాబ్‌ తన నివాసంలోనే సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉంటున్నారనీ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. మార్చి 25న మొదలైన దేశవ్యాప్త లాక్‌డౌన్‌ సమయం నుంచి ఆయన తన నివాసానికే పరిమితమయ్యారు. ఇటీవల తన ఇంట్లోనే కౌన్‌ బనేగా కరోడ్‌ పతి కార్యక్రమం ప్రమోషనల్‌ కాంటెంట్‌ తదితర ప్రాజెక్టులకు సంబంధించిన పనుల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన సిబ్బంది ద్వారానే ఆయనకు కరోనా వైరస్‌ సోకి ఉంటుందని భావిస్తున్నారు. కాగా, అమితాబ్‌ కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌కు కూడా తనకు కోవిడ్‌–19 పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

కాసేపటికే అభిషేక్‌  కూడా తనకు పాజిటివ్‌ అని ధ్రువీకరించారు. ‘మా ఇద్దరికీ తేలికపాటి లక్షణాలు ఉన్నాయి. ఆస్పత్రిలో చేరాం. సంబంధిత అధికారులందరికీ సమాచారమం దించాం. అభిమానులెవరూ కూడా ఆందోళన చెందవద్దని కోరుతున్నాను.. ధన్యవాదాలు’ అని అభిషేక్‌ వెల్లడించారు. కాగా, జయాబచ్చన్‌, ఐశ్వర్యరాయ్‌లకు కరోనా నెగెటివ్‌ వచ్చింది. దీంతో అమితాబ్‌ కుటుంబసభ్యులతో పాటు అభిమానులు కాస్త ఊరట చెందారు.