నిర్మాతగా మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కుమార్తె

నిర్మాతగా మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కుమార్తె

మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత నిర్మాతగా మారారు. ఇప్పటికే సుష్మిత ఫ్యాషన్‌ డిజైనర్‌గానే కాకుండా, తన తండ్రి చిరంజీవికి కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా మారి మంచి మార్కులు కొట్టేసిన సంగతి తెలిసిందే. తాజాగా సుష్మిత తన భర్త విష్ణుతో కలిసి గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పేరిట నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థ మొదటగా ఓ వెబ్‌ సిరీస్‌ ద్వారా డిజిటల్‌ ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.(చదవండి : చిరు జుట్టుతో ఆడుకున్న సుష్మిత‌)

కాగా, ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే హైదరాబాద్‌లో జరిగాయి. మెగాస్టార్‌ సతీమణి సురేఖ చేతుల మీదుగా ఈ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన సుష్మిత.. తన తల్లికి ధన్యవాదాలు తెలిపారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సుష్మితకు బెస్ట్‌ విషెస్‌ చెబతున్నారు.