టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్‌ను అనుకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పింక్‌బాల్ టెస్టు నేపథ్యంలో బుధవారం మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ సెషన్లో కోహ్లి స్మిత్ స్టైల్లో ఆడాడు. నెట్ బౌలర్ వేసిన బంతిని సమర్థంగా ఎదుర్కొన్న కోహ్లి డిఫెండింగ్ షాట్ ఆడి బ్యాట్‌ను ముందుకు.. వెనక్కు జరపాడు.అయితే బంతిని డిపెండ్ చేసే సమయంలో స్మిత్ ఇలాంటి శైలిలోనే అనుకరిస్తాడు. ఇలాంటి చర్యలతో స్మిత్ చాలాసార్లు పాపులర్ అయ్యాడు. తాజాగా కోహ్లి స్మిత్‌లా ప్రవర్తించడం నవ్వు తెప్పిస్తుంది. ఐయామ్ విరాట్ కోహ్లి.. స్టీవ్ స్మిత్‌ను ఇమిటేట్ చేస్తున్నా అంటూ క్యాప్షన్ జత చేశాడు.
కాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో తొలి రోజు ఆటలోనే టీమిండియా పట్టు బిగించింది. మొదట ఇంగ్లండ్‌ను 112 పరుగలకే ఆలౌట్ చేసిన టీమిండియా ఆ తర్వాత బ్యాటింగ్‌ను ఆచితూచి ఆడుతుంది. ప్రస్తుతం టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 41 పరుగులు, కెప్టెన్ విరాట్ కోహ్లి 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు అక్షర్ పటేల్ 6 వికెట్లు తీసి ఇంగ్లండ్ నడ్డి విరిచాడు. టీమిండియా బౌలర్ల దాటికి ఓపెనర్ క్రావ్లే మినహా ఏ ఒక్క బ్యాట్స్‌మెన్ పరుగులు చేయలేకపోయారు.