కోమటిరెడ్డి బ్రదర్స్ మౌనం రణమా, వ్యూహమా?

Komatireddy Brothers silence after revanth join congress party

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

టీ కాంగ్రెస్ లో ఒక్కసారిగా ఉత్సాహం పొంగిపోతోంది. తెలంగాణాలో కెసిఆర్ విజయం ఏకపక్షం అనే స్థితి నుంచి ఈసారి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తోంది అన్న వాతావరణం ఏర్పడింది. రేవంత్ చేరిక, విజయశాంతి రీ యాక్టివ్ తదితర పరిణామాలు ఒక్కసారిగా కాంగ్రెస్ కి ఊపు తెచ్చాయి. నెల రోజుల వ్యవధిలో వచ్చిన మార్పు తో ఒక్కసారిగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ అయిపోయారు. జానారెడ్డి లాంటి నేత తాను కాంగ్రెస్ లో అద్వానీ లాంటి వాడిని అని చెప్పడం ద్వారా ఉత్తమ్ కి లైన్ క్లియర్ చేసినట్టు అయ్యింది. రేవంత్ ప్రస్తుతానికి కాంగ్రెస్ లో ఓ మెరుపులా కనిపిస్తున్నాడు. అయితే ఇదే ఊపు దీర్ఘకాలం కొనసాగుతుందో ,లేదో ఇప్పుడే చెప్పలేం. అందుకే ఇప్పటికిప్పుడు చూసుకుంటే తెలంగాణ కాంగ్రెస్ బాహుబలి ఉత్తమ్ మాత్రమే. ఈ పరిణామం మిగిలిన వారి విషయంలో ఎలా వున్నా కోమటిరెడ్డి బ్రదర్స్ కి మంటెక్కిస్తోంది.

PCC-President-uttam-kumar-r

నిజానికి ఓ రెండు నెలల కిందట చూస్తే మీడియా లో కోమటిరెడ్డి బ్రదర్స్ హడావిడి బాగా కనిపించింది. ఉత్తమ్ కి వ్యతిరేకంగా ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ కి ప్రయత్నించి ఆయన్ని తొలగించడంలో విఫలమయ్యారు. అయితే ప్రజల్లో బలం ఉంటే సీన్ అదే మారుతుందన్న నమ్మకంతో మీడియా రంగంలోకి రావడంతో పాటు పాదయాత్ర చేద్దామన్న ఆలోచన కూడా సీరియస్ గా చేశారు. కానీ ఆ ప్రయత్నాలకు కూడా కాంగ్రెస్ లోని మిగతా నేతలు, హైకమాండ్ నుంచి కూడా పెద్దగా సానుకూల సంకేతాలు రాలేదని తెలుస్తోంది. ఇక అప్పటినుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ సైలెంట్ గా వున్నారు. అయితే ఈ మౌనం మీద భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

revanth-reddy

కోమటిరెడ్డి బ్రదర్స్ దూకుడు సంగతి తెలిసిన వాళ్ళు ఈ మౌనం తుఫాన్ ముందర ప్రశాంతత గా చెప్పుకుంటున్నారు. అదను చూసి దెబ్బ కొట్టడానికి ఓ అడుగు వెనక్కి వేసినట్టు చెప్పుకుంటున్నారు. తగిన అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన ఉత్తమ్ సైతం ముందు జాగ్రత్తగా హైకమాండ్ దృష్టికి కోమటిరెడ్డి బ్రదర్స్ మ్యాటర్ తీసుకెళ్ళారంట. మొత్తానికి టీ కాంగ్రెస్ లో ఉత్సాహం వెనుకే ఉత్పాతం రెడీ గా వుంది.

komatereddy-brothers