కొండా దంపతులు కూడా కాంగ్రెస్ లోకి ?

konda surekha family joins in Congress party

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
రేవంత్ ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో సెగ రేపుతోంది. తెరాస వైపు టీడీపీ ఓర చూపులు చూడడం భరించలేక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి జంప్ కావడానికి సిద్ధం అయిపోయారన్న వార్త రేపుతున్న కాక దిగక ముందే ఇంకో షాకింగ్ విషయం హల్ చెల్ చేయడం మొదలైంది. అదే కొండా దంపతులు కూడా కాంగ్రెస్ లోకి వస్తారన్న వార్త.

తెలంగాణ ఇచ్చి కూడా కెసిఆర్ తో దెబ్బ తిన్న కాంగ్రెస్ అదను చూసి తన వ్యూహాలకి పదును పెడుతోంది. జైపాల్ రెడ్డి, జానా, కార్తీక్ సహా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకమాండ్ తో కలిసి కాంగ్రెస్ కి తెలంగాణాలో కొత్త ఊపు తెచ్చే ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. రాహుల్, సోనియా అనుమతితో ఇతర పార్టీల్లోని ముఖ్యులకు గాలం వేసే పని చేస్తున్నారు. అలా పార్టీలోకి వచ్చే నేతలకి తాము కాకుండా అధిష్టానం ముఖ్యులతోనే హామీలు ఇప్పిస్తున్నారు. ఆ కోవలోనే ముందుగా రేవంత్ కి హామీ దొరికిందట.

ఇప్పుడు కాంగ్రెస్ అలా రా రమ్మని పిలుస్తున్న జాబితాలో జగన్ కోసం ఆ పార్టీని వీడివెళ్లిన కొండా దంపతులు ఉన్నట్టు తెలుస్తోంది. తెరాస లో ఉన్నప్పటికీ తమకు ప్రాధాన్యం దక్కడం లేదని అసంతృప్తితో రగిలిపోతున్న కొండా దంపతులతో కాంగ్రెస్ దూతలు ఇప్పటికే ఓ రౌండ్ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే 10 జన్ పథ్ వ్యూహం ప్రకారం రేవంత్ తో పాటు కొండా దంపతులు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు వున్నాయి అంటున్నారు.