పవన్‌ సలహాతో హీరోగా… ఇదో పెద్ద జోక్‌

sai dharam tej younger brother Vaishnav entry into films as upcoming hero

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

మెగా ఫ్యామిలీ నుండి రెండు మూడు సంవత్సరాలకు ఒక్కరు ఇద్దరు చొప్పున హీరోలుగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తూనే వస్తున్నారు. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారి సంఖ్య పెద్దగానే ఉంది. వారిలో కొందరు సక్సెస్‌ అయ్యారు, మరి కొందరు సక్సెస్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ నుండి హీరోగా మరో ఎంట్రీ జరుగబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్‌ తేజ్‌ తమ్ముడు అయిన వైష్ణవ్‌ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వడం ఖాయం అయ్యింది. ఇటీవల ఈయన సినీ వేడుకల్లో ఎక్కువగా కనిపిస్తున్నాడు. సినిమా వారితో ఈయన పరిచయాలు పెంచుకోవడంతో పాటు యాక్టింగ్‌ కూడా నేర్చుకున్నాడు. విదేశాల్లో డాన్స్‌ మరియు యాక్షన్‌ సీన్స్‌లో మెలుకువలు నేర్చుకుని వచ్చాడు.

అతి త్వరలోనే మెగా ఫ్యామిలీ అంతా కలిసి వైష్ణవ్‌ను అధికారికంగా మెగా ఫ్యాన్స్‌కు పరిచయం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం పలు కథలు వైష్ణవ్‌ కోసం సిద్దం చేయిస్తున్నారు. ఒక ప్రేమ కథా చిత్రంతో ఈ మెగా హీరో ఎంట్రీ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ నుండి హీరోలుగా ఎంత మంది వచ్చినా కూడా వారికి పవన్‌ పెద్దగా సహాయ సహకారాన్ని అందించడు అనే విషయం తెల్సిందే. వారసత్వం అంటే పవన్‌కు అస్సలు ఇష్టం ఉండదు. అదే మెగా కుటుంబ సభ్యులకు నచ్చదు.

పవన్‌పై కోపం ఉన్నప్పటికి అతడికి ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్‌ దృష్ట్యా అతడిని మా ఫ్యామిలీ హీరో అని చెప్పుకుంటున్నారు. తాజాగా వైష్ణవ్‌ను హీరోగా ప్రయత్నించమంటూ పవన్‌ సలహా ఇచ్చాడట. అందుకే వైష్ణవ్‌ హీరో అవ్వాలని నిర్ణయించుకున్నాడట. గత రెండు మూడు రోజుగా ఈ విషయాన్ని మెగా సన్నిహితులు తెగ పబ్లిసిటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పవన్‌ వెనుక ఉన్నాడు అంటే వైష్ణవ్‌కు మంచి క్రేజ్‌ దక్కుతుంది అనేది వారి అభిప్రాయం. అందుకే పవన్‌ పేరును ఇలా వాడేస్తున్నారు. కాని పవన్‌ ఎప్పటికి అలా చెప్పడని, ఇదో పెద్ద జోన్‌ అని పవన్‌ గురించి పూర్తిగా తెలిసిన వారు అంటున్నారు.