కేసీఆర్‌పై కొండా సురేఖ సెటైర్లు

Konda Surekha To Leave TRS

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి మంత్రి కొండా సురేఖ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీం ఇండియా 14 వేల రన్నులు కొట్టి విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు కొట్టగా… మన రాష్ట్ర ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా దాదాపు ఈ 14 నెలల కాలంలో 14 రోజులు కూడా అసెంబ్లీకి రాలేదన్నారు. ప్రజా సమస్యలపై ప్రజలకి అందుబాటులో ఉండకపోవడం దేశ రాజకీయ చరిత్రలో పెద్ద రికార్డే కదా అంటూ ఎద్దేవా చేశారు. 14 నెలలుగా ఇంకా విరాట పర్వం వీడని ప్రతిపక్ష నేత కేసీఆర్ అంటూ మంత్రి సురేఖ ట్వీట్ చేశారు.

https://x.com/iamkondasurekha/status/1893851651636867301