కొండా విశ్వేశ్వర్ రెడ్డి దెబ్బ టీఆర్ఎస్ కు తగిలినట్టేనా…?

Congress Leader Vishweshwar Reddy About KCR Ruling

కొండా విశ్వేశ్వర్ రెడ్డి గత ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి సంచలన విజయం సాధించిన నేత. అసలు టీఆర్‌ఎస్‌కు గెలుపు అవకాశాలే లేవనుకున్న పార్లమెంట్ స్థానం చేవెళ్లే. ఎందుకంటే ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ మూడు చోట్ల.. తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూర్ వీటిలో తాండూర్ మినహా మిగతా మూడు కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటలు లాంటివి. అయితే ఒక్క తాండూరులో మాత్రం టీడీపీ నుంచి వెళ్లిన మంత్రి మహేందర్ రెడ్డి టీఆర్ఎస్‌కు అండగా ఉన్నారు. ఆ ఒక్కటి తప్ప ఇక ఏ సమీకరణం కలసి రాని పరిస్థితి. అయినప్పటికీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. దీనికి కారణం టీఆర్ఎస్ బలం కన్నా ఆయన బ్యాక్‌గ్రౌండే. రంగారెడ్డి జిల్లా పేరు ఏర్పడింది ఆయన పూర్వీకులైన కొండా వెంకట రంగారెడ్డి పేరు మీదే. అయతే కొండా విశ్వేశ్వరరెడ్డి టీఆర్‌ఎస్‌లో ఇమడలేని పరిస్థితి ఏర్పడింది. జిల్లా మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితో ఆయనకు అసలు పడటం లేదట.ఈ వివాదం 2014 ఎన్నికల అనంతరమే మొదలైనా ఎప్పటికప్పుడు కేటీఆర్‌ లేదా కవిత ఇలా ఎవరో ఒకరు మధ్యవర్తిత్వం చేసి సరిపెట్టేవారు. ఆ తరువాత కొంత మేర సర్దుమణిగినా తిరిగి వివాదం చెలరేగుతూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన తరుణంలో పార్టీ మారడానికి ఇదే మంచి సమయమని ఎంపీ భావించారు. పార్టీకి, ఎంపీ అభ్యర్థిత్వానికి కూడా రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Congress That Gave Shock To The TDP Candidate
ఇదే విషయం పలు మీడియా సంస్థల్లోనూ వచ్చాయి. దాన్ని బహిరంగంగా ఆయన ఖండించారు. అయినా నివురు కప్పిన నిప్పులా ఉన్న ఈ అంశం ఎన్నికల మందు తమ పార్టీకి నష్టం చేస్తుందని భావించిన టీఆర్‌ఎస్‌ పెద్దలు వెంటనే ఆయిన్న సంప్రదించి బుజ్జగించారు. కనీసం ఎన్నికల అయ్యేవరకు తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాలని కూడా కోరారని తెలుస్తోంది. ఆరు నెలల నుంచి ఆయన కాంగ్రెస్‌ అధిష్ఠానంతో టచ్‌లోనే ఉన్నారట ఆ విషయం తెలిసిన తరువాత ఆయన్ని వెళ్లదని చెప్పడం కన్నా తమకు అనుకూలమైన సమయంలో వెళితే సరిపోతుందని కోరారట. వెళ్లేవాడిని వెళ్లొదని కాకుండా కొంతకాలం ఆగాలని కోరడం మరింత ఆగ్రహం తెప్పించిందట గతంలో తన ముఖ్యమైన అనుచరులు పైలెట్‌ రోహిత్‌ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడం వెనుక మహేందర్‌రెడ్డి ఉన్నారని ఆయన బలంగా నమ్మారు. అదే విషయం పదేపదే పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా స్పందించని వారు ఇప్పుడు తనను ఏ రకంగా అడుగుతారని సన్నిహితుల దగ్గర వాపోయారట కాంగ్రెస్‌తో ఆయన సన్నిహిత సంబంధాలు నెరుపుతూ పైలెట్‌ రోహిత్‌రెడ్డికి కాంగ్రెస్‌ నుంచి తాండూరు టికెట్‌ ఇప్పించడంలో విశ్వేశ్వరరెడ్డి కీలకంగా వ్యవహరించారని తెలుస్తోంది. అంటే తన ప్రత్యర్థి పట్నం మహేందర్‌రెడ్డిపైనే తన అనుచరుడిని గెలిపించాలని లక్ష్యం పెట్టుకోవడం తెలుస్తూనే ఉంది. దానితోపాటు తనకు బాగ నమ్మకస్తుడైన కెఎస్‌ రత్నానికి కూడా చేవెళ్ల నుంచి కాంగ్రెస్‌ టికెట్‌ వచ్చేలా తెరవెనుక చక్రం తిప్పారు. సరిగ్గా ఎన్నికల ముందు పార్టీని వీడితేనే తమ వర్గానికి ప్రయోజనం ఉంటుందని ఆయన భావించారు. అనుకున్న విధంగా మూడు పేజీల రాజీనామా లేఖ రాసి, దాంట్లో తన ఆవేదన అంతా వ్యక్తం చేశారు.

TRS-MP-Konda-Vishweshwar-Re
తనని మొదటి నుంచి ఎలా చిన్నచూపు చూసింది.. ఓడిపోయే సీటు కాబట్టి తనకి ఏ సమయంలో ఇచ్చారు వంటివి కూడా అందులో పేర్కొనడం గమనార్హం. ఎందుకంటే విశ్వేశ్వర్ రెడ్డి సంప్రదాయ రాజకీయ నాయకుడు కాదు. ఆయన ఎలా పడితే అలా మాట్లాడరు. పద్దతిగా పార్లమెంటరీ పద్దతిలోనే చేసుకోవాలనుకుంటారు. తన తాతల తరం నుండి రాజకీయంగా చక్రం తిప్పిన కుటుంబానికి కనీస అధికారాలు కానీ ప్రాధాన్యత కానీ రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో లేకుండా పోయింది. నిమిత్త మాత్రుడిగా ఉండటం ఇష్టం లేక ఆయన రాజీనామా చేసేశారు. విశ్వేశ్వర్ రెడ్డి క్లీన్ ఇమేజ్ ఉన్న నేత. ఆయన రాజీకనామా కచ్చితంగా తెలంగాణ రాష్ట్ర సమితికి మైసన్ అవుతుంది. ఆయన రాసిన మూడు పేజీల లేఖలో ఎక్కడా ఆరోపణలులా అనిపించడం లేదు. ఏది ఏమైన ఎన్నికల ముందు కొండా ఇచ్చిన షాక్‌కు టీఆర్‌ఎస్‌కు దిబ్బతిరిగిపోయిందనే చెప్పాలి.

congress-trs