రామ్ ఆశలన్ని పూరి పైనే..!!

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కెరీర్ లో ఎన్నో విజయవంత అయ్యినా సినిమాలు తీసాడు. కొంత మంది స్టార్స్ కి తన సినిమా తో లైఫ్ ఇచ్చాడు కూడా. అలాంటిది ఇప్పుడు పూరి కేరీర్ అంతగా బాగా లేదు. ఎప్పుడు రొటీన్ ఫార్ములాతో సినిమాలు తీస్తాడు అన్న పేరును సంపాదించుకున్నాడు. ఒక్క సినిమా పుర్తి అవ్వగానే మరో సినిమా కు క్లాప్ కొట్టే పూరి తన కొడుకు నటించిన మెహబూబా చిత్రం తరవాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఎనర్జిటిక్ హీరో రామ్ తో ఓ సినిమా గురుంచి పూరి డిస్కషన్ చేసాడంట. అదే సమయంలో రామ్ కూడా మరో డైరెక్టర్ పేరును తీసుకువచ్చాడు. చివరికి పూరి కి రామ్ గ్రీన్ సిగ్నలు ఇచ్చాడంట.

ఈ చిత్రం ను తన పెద్ద నాన్న స్రవంతి రవి కిషోర్-పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తారు అని సమాచారం. పుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ నుండి సెట్స్ ఫైకి వెళ్లనున్నది. రామ్ -పూరి లు కలిసి చేస్తున్న మెదటి చిత్రం కావడం తో ప్రేక్షకులో ఆసక్తిని కలిగించేలా ఉన్నది. అలాగే ఈ చిత్రం పూరి కి విజయం సాదించడం చాలా ముఖ్యం. ఎందుకంటే స్టార్ హీరోస్ ఎవ్వరు పూరి తో సినిమాలు చెయ్యాడానికి ముందుకు రావడం లేదు. అలాగే వరుస పరాజయాలతో సతమత మవుతున్న రామ్ కూడా పూరి సినిమా ఫై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.