కొరటాలకు ఒకే ఆప్షన్‌

koratala siva next movie with allu arjun

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

‘మిర్చి’ చిత్రంతో కెరీర్‌ను ప్రారంభించిన దర్శకుడు కొరటాల శివ చేసిన అన్ని సినిమాలతో బ్లాక్‌ బస్టర్‌ను దక్కించుకున్నాడు. తాజాగా చేసిన ‘భరత్‌ అనే నేను’ చిత్రం కూడా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా 150 కోట్లను వసూళ్లు చేసి దుమ్ము రేపుతోంది. ఇంకా కూడా కలెక్షన్స్‌ జోరు కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రం రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించడం ఖాయం అని ఇప్పటికే తేలిపోయింది. ఇక ఈ చిత్రం తర్వాత కొరటాల శివ చేయబోతున్న సినిమా ఏంటీ అనే విషయమై ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేసేందుకు స్టార్‌ హీరోలు అంతా కూడా ఆసక్తిగా ఉన్నారు. అయితే ఖాళీగా ఉన్నది మాత్రం ఒక్క అల్లు అర్జున్‌ మాత్రమే.

తాజాగా మహేష్‌బాబుతో సినిమా చేసిన కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని రామ్‌ చరణ్‌తో చేస్తాను అంటూ ఆమద్య ప్రకటించాడు. పత్రిక ప్రకటన కూడా ఇవ్వడంతో ఇద్దరి కాంబో ఖాయం అని అంతా భావించారు. అయితే బోయపాటి మరియు రాజమౌళిల చిత్రాలను పూర్తి చేసేందుకు చరణ్‌కు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే కొరటాల, చరణ్‌ల కాంబో ఇప్పటల్లో లేనట్లే. ఎన్టీఆర్‌ కూడా త్రివిక్రమ్‌, రాజమౌళిల సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం బన్నీ మాత్రమే కొరటాల ముందు ఉన్న ఆప్షన్‌ అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ‘నా పేరు సూర్య’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయిన అల్లు అర్జున్‌ తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. వచ్చే నెలలో వీరిద్దరి కాంబో మూవీ అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది.