కాస్టింగ్‌ కౌచ్‌.. ఇప్పుడు కాస్త నయమే

nuvvu nenu heroine anitha about casting couch

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

సినిమా పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌ ఈమద్య మొదలైంది కాదని, పదుల సంవత్సరాలుగా కాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారం ఉందని ఇటీవలే ఒక సీనియర్‌ దర్శకుడు చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. ప్రస్తుతంతో పోల్చితే కొన్ని సంవత్సరాల క్రితం కాస్టింగ్‌ కౌచ్‌ టాలీవుడ్‌లో ఎక్కువగా ఉండేదని, ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిన కారణంగా తప్పు చేస్తే ఎక్కడ బయట పడతామో అనే భయం ఎక్కువ మందిలో ఉండి తప్పు చేసేందుకు భయపడుతున్నారు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. తాజాగా అదే విషయాన్ని ‘నువ్వు నేను’ చిత్రం హీరోయిన్‌ అనిత కూడా చెప్పుకొచ్చింది. తాను హీరోయిన్‌గా ఉన్న సమయంలో కాస్టింగ్‌ కౌచ్‌ దారుణంగా ఉందని పేర్కొంది.

ప్రస్తుతం హిందీ బుల్లి తెరపై సందడి చేస్తున్న ఈ అమ్మడు కాస్టింగ్‌ కౌచ్‌ గురించి స్పందించింది. అన్ని భాషల పరిశ్రమలో కూడా కాస్టింగ్‌ కౌచ్‌ ఉందని, అయితే ప్రస్తుతంతో పోల్చితే తాను హీరోయిన్‌గా ఉన్న సమయంలో ఎక్కువగా ఉండేదని, హీరోయిన్స్‌, నటీమనులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అంటూ చెప్పుకొచ్చింది. కొత్తగా వచ్చే వారు అమాయకంగా ఉండకుండా కాస్త చలాకిగా ఉండి, అందరితో స్పీడ్‌గా ఉన్నప్పుడు మాత్రమే కాస్టింగ్‌ కౌచ్‌ను తప్పించుకోవచ్చు అని, లేదంటే అంతా కూడా వాడేసుకోవాలని చూస్తారు అంటూ అనిత చెప్పుకొచ్చింది.