ఓటిటిలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన “కోటబొమ్మాళి పిఎస్”

ఓటిటిలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన “కోటబొమ్మాళి పిఎస్”
Cinema News

సీనియర్ హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో యంగ్ నటీనటులు శివాత్మిక రాజశేఖర్ మరియు రాహుల్ విజయ్ లు నటించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ అండ్ ఎమోషనల్ డ్రామా “కోటబొమ్మాళి పిఎస్”. మరి ఈ మూవీ లో మలయాళ సూపర్ హిట్ మూవీ “నాయట్టు” కి రీమేక్ గా దర్శకుడు తేజ మార్ని తెరకెక్కించగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన ఈ మూవీ లో తెలుగులో కూడా సాలిడ్ వసూళ్లు అందుకొని మంచి హిట్ అయ్యింది.

ఓటిటిలో స్ట్రీమింగ్ కు  వచ్చేసిన “కోటబొమ్మాళి పిఎస్”
Botabommali PS

అలాగే వినూత్న ప్రమోషన్స్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఓటిటిలో అయితే స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు కొనుగోలు చేయగా అందులో ఈరోజు నుంచి అయితే ఈ మూవీ వచ్చేసింది. మరి అప్పుడు మిస్ అయ్యి ఇప్పుడు చూడాలి అనుకునేవారు ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ను వీక్షించవచ్చు. ఇక ఈ మూవీ కి రంజన్ రాజ్ సంగీతం అందించగా గీతా ఆర్ట్స్ 2 వారు నిర్మాణం వహించారు. ఓటిటిలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన “కోటబొమ్మాళి పిఎస్”