Crime: హైదరాబాద్‌ లో దారుణం.. రౌడీ షీటర్ దారుణ హత్య..!

Crime: Marriage in a few hours... Groom's death at the hands of his father
Crime: Marriage in a few hours... Groom's death at the hands of his father

హైదరాబాద్‌ లో దారుణం చోటు చేసుకుంది. రౌడీ షీటర్ మర్మాంగం కట్‌ చేసి…దారుణ హత్యకు పాల్పడ్డారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. రౌడిషీటర్ పై కత్తులతో దాడి చేసి హత్య చేశారు కొందరు గుర్తుతెలియని వ్యక్తులు. ముబారఖ్ సిగార్ అనే రౌడిషీటర్ పై కత్తులతో దాడి చేశారు.

ముబారఖ్ సిగార్ మర్మాంగాలు కట్ చేసిన దుండగులు బాధితుడి శరీరంపై అనేక సార్లు పొడిచి అతి దారుణంగా హత్య చేశారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి వాదియే ముస్తఫా షేహిన్ నగర్ వద్ద ఈ ఘటన జరిగింది. మృతుడు బాలాపూర్ ప్రాంతానికి చెందిన ముబారఖ్ సిగార్ అనే రౌడిషీటర్ గా గుర్థించారు పోలీసులు. ఇక ముబారఖ్ సిగార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలపై విచారణ ముమ్మరం చేశారు బాలాపూర్ పోలీసులు.