తెలుగు వెండితెరపై ‘ఉప్పెన’లా దూసుకొచ్చిన హీరోయిన్ కృతిశెట్టి. ఉప్పెన చిత్రంలో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ భామ.. పక్కింటి అమ్మాయిగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అద్భుతమైన నటనతో ప్రేక్షకులనే కాకుండా దర్శక నిర్మాతలను కూడా క్యూ కట్టేలా చేసింది. ‘ఉప్పెన’సినిమాకి ముందు కృతిశెట్టి అంటే ఎవరో తెలియలేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా, మోడల్‌గా పలు యాడ్స్ తో ఓ మోస్తారు గుర్తింపు పొందింది కృతి శెట్టి. కానీ `ఉప్పెన` చిత్రంలో హీరోయిన్గా నటించాక ఆమె రేంజే మారిపోయింది.
ఒకే ఒక సినిమాతో కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిపోయింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరుగా కృతిశెట్టి స్థానం సంపాదించింది. ప్రస్తుతం కృతి నానితో `శ్యామ్ సింగరాయ్`, సుధీర్‌బాబుతో `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`, రామ్ పోతినేనితో లింగుస్వామి చిత్రంలో నటిస్తుంది. అలాగే నితిన్‌తో ‘మాచర్ల నియోజకవర్గం’చిత్రంలోనూ ఆమే హీరోయిన్. మరోవైపు ఇటీవల `బంగార్రాజు`లో నాగచైతన్య సరసన హీరోయిన్గా ఎంపికైంది. ఇలా టాలీవుడ్లో తనకు వస్తున్న డిమాండ్‌ని దృష్టిపెట్టుకొని పారితోషికాన్ని అమాంతం పెంచిందట ఈ ‘బేబమ్మ’.
తొలి సినిమా ‘ఉప్పెన’ కోసం కేవలం రూ.6 లక్షలను మాత్రమే పారితోషికంగా తీసుకుందట కృతి. అయితే ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో దాదాపు 60 లక్షల వరకు గిఫ్ట్ రూపంలో అందించారట నిర్మాతలు. ఇక ఉప్పెన విడుదలకు ముందే ఒప్పుకున్న నాని ‘శ్యామ్ సింగరాయ్’కోసం దాదాపు రూ.20 లక్షలను పారితోషికంగా తీసుకుందట.