కృతీ శెట్టి ఓ సవాల్‌కి సై అన్నారట. లేడీ ఓరియంటెడ్ సినిమా చేయనున్నారని టాక్. మామూలుగా స్టార్ హీరోయిన్ అనిపించుకుని, ఓ పాతిక సినిమాలకు పైగా చేసి ఉంటే ఆ కథానాయికను నమ్మి లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తుంటారు. అలాంటిది జస్ట్ ఒక్క సినిమా లో కనిపించిన కృతీ శెట్టితో లేడీ ఓరియంటెడ్ సినిమా అంటే చిన్న విషయం కాదు. అయితే ‘ఉప్పెన’తోనే తనలో మంచి నటి ఉందని నిరూపించుకున్నారు కాబట్టి కృతీకి ఈ ఆఫర్ వచ్చి ఉంటుంది.
రాజ్‌తరుణ్‌తో ‘ఉయ్యాల జంపాల’, నానీతో ‘మజ్ను’ చిత్రాలు తెరకెక్కించిన విరించి వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారట. చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత నిర్మించనున్నారని సమాచారం. ఇక నానీతో కృతి నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ ఈ 24న విడుదల కానుంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి.