ఉప్పెన సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి. చూడడానికి అచ్చం తెలుగు అమ్మాయిలా ఉండే ఈ కన్నడ భామ.. ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది. ‘ఉప్పెన’తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది ఈ భామ. ఆకర్షించే ఆందంతో పాటు, ఆకట్టుకునే నటనతో తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టిన కృతి ఇప్పుడు మరో మూడు సినిమాల్లో నటిస్తుంది.
సుధీర్‌బాబుతో ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, రామ్‌తో ‘ది వారియర్’, నితిన్‌తో ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమాలు చేస్తుంది. తాజాగా ఈ భామ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో జతకట్టే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది. రీసెంట్‌గా రాధేశ్యామ్‌తో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ కాగా, ఇప్పటికే కృతిశెట్టి ఎంపికయినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.