ల‌క్కీ ఛాన్స్ ని కొట్టేసిన కృతి శెట్టి..?

Kriti Shetty who hit the lucky chance..?
Kriti Shetty who hit the lucky chance..?

టాలీవుడ్ లో ‘ఉప్పెన’ సినిమా తో ఒక్కసారిగా సెన్సేష‌న్ క్రియేట్ చేసిన బ్యూటీ కృతి శెట్టి, యూత్ హాట్ ఫేవ‌రేట్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ మూవీ లో అమ్మ‌డి అందం, అభిన‌యానికి కుర్ర‌కారు ఫిదా అయ్యారు. ఇక ఆ త‌రువాత వ‌రుస‌గా స‌క్సెస్ ఫుల్ మూవీ ల‌తో టాలీవుడ్ లో దూసుకెళ్లింది ఈ బ్యూటీ. కానీ ఇటీవ‌ల వ‌రుస ఫ్లాప్ మూవీ ల‌తో ప్రేక్ష‌కులకు నిరాశ‌ను మిగిలిస్తోంది ఈ బ్యూటీ.

Kriti Shetty who hit the lucky chance..?
Kriti Shetty who hit the lucky chance..?

అయితే, రీసెంట్ గా ‘మ‌న‌మే’ మూవీ తో తిరిగి స‌క్సెస్ ట్రాక్ ఎక్కాల‌ని గ‌ట్టిగానే ప్లాన్ చేసింది ఈ బ్యూటీ. కానీ, ఆమె ప్ర‌యత్నం అంతంత మాత్రంగానే వ‌ర్క‌వుట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఒక ల‌క్కీ ఛాన్స్ కృతి శెట్టిని వ‌రించిన‌ట్లుగా తెలుస్తుంది . మ‌ల‌యాళ న‌టుడు దుల్క‌ర్ స‌ల్మాన్ ప్ర‌స్తుతం టాలీవుడ్ లో వ‌రుసగా మూవీ లు ఓకే చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్ప‌టికే ‘ల‌క్కీ భాస్క‌ర్’ మూవీ న్ని పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేశాడు ఈ హీరో. ఇక త‌న నెక్ట్స్ మూవీ న్ని కూడీ ఓకే చేశాడ‌ట దుల్క‌ర్.

ద‌ర్శ‌కుడు సెల్వ‌రాజ్ డైరెక్ష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్క‌నుండ‌గా, ఇందులో దుల్క‌ర్ హీరోగా న‌టిస్తున్నాడు. అయితే, ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కృతి శెట్టికి హీరోయిన్ గా ఛాన్స్ వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఇక ఈ మూవీ ను రానా ద‌గ్గుబాటి ప్రొడ్యూస్ చేయ‌నున్నట్లుగా తెలుస్తోంది. ఈ మూవీ కు సంబంధించిన అధికారిక ప్ర‌క‌టన త్వ‌ర‌లో రానుంద‌ని తెలుస్తోంది. ఏదేమైనా ఈ మూవీ తో తిరిగి త‌న అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కృతి శెట్టి ప్ర‌య‌త్నిస్తోంది.