కేటీఆర్ కి నో మంత్రి పదవి…డైరెక్ట్ గా ముఖ్యమంత్రే !

KTR Announces Vinod As Karimnagar Lok Sabha Contestant

తెలంగాణలో రెండోసారి అధికారంలోకి రావడంతో తెలంగాణ రాష్ట్ర సమితి శ్రేణుల్లో జోష్ నెలకొంది. పార్టీ అధినేత కేసీఆర్ ఇదే ఉత్సాహంతో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని యోచిస్తున్నారు. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళతానని, బీజేపీ, కాంగ్రెసేతర ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తానని ఎన్నికలకు ముందు నుంచే కేసీఆర్‌ చెబుతున్న విషయం తెలిసిందే. తాజాగా, వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలను సమీకరించి జాతీయ స్థాయిలో కొత్త పార్టీని పెట్టబోతున్నట్లు ప్రకటించారు. దీనిలో భాగంగా ప్రభుత్వంతో పాటు పార్టీని చూసుకోవడం కష్టంగా ఉంటుందని భావించి పార్టీ కార్యకలాపాలను తన కుమారుడు కేటీఆర్‌కు అప్పగించారు. కేటీఆర్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. కేటీఆర్‌ తొలుత టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అవుతారని, ఆ తర్వాత కేసీఆర్‌ స్థానంలో సీఎం అవుతారని మూడు నాలుగేళ్లుగా పార్టీ శ్రేణుల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. అందులో ఇప్పుడు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియామకం పూర్తయిందని, జరగాల్సింది ముఖ్యమంత్రిగా పట్టాభిషేకమేనని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు. తనపై పని ఒత్తిడిని తగ్గించుకోవటానికి కేటీఆర్‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించినట్లు కేసీఆర్‌ చెబుతున్నా ఆయనను సీఎం పదవికి చేరువ చేసే ప్రక్రియ మొదలైనట్టేనని పార్టీ వర్గాలు వివరిస్తున్నాయి.

కేటీఆర్ కి నో మంత్రి పదవి...డైరెక్ట్ గా ముఖ్యమంత్రే ! - Telugu Bullet

పంచాయతీ, స్థానిక సంస్థలు, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ యంత్రాంగాన్ని కేటీఆర్‌ ముందుండి నడిపిస్తారని టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుకున్నట్లుగానే 16 స్థానాలను గెల్చుకొని కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో మరింత బిజీ అవుతారని అభిప్రాయపడుతున్నారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించిన నేపథ్యంలో కేటీఆర్‌ను ఈసారి మంత్రివర్గంలోకి తీసుకోకపోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే ఐదారు నెలలపాటు కేటీఆర్‌ పూర్తిగా పార్టీ కార్యకలాపాలు, ఎన్నికలకే పరిమితమవుతారని, వాటిని విజయవంతం చేయడంపైనే దృష్టి సారిస్తాయని వివరిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల కేటీఆర్‌ను సీఎంను చేసి, కేసీఆర్‌ జాతీయ రాజకీయాలు చూసుకుంటారని పేర్కొంటున్నాయి. కేసీఆర్ వారసుడిగా, కార్యకర్తలకు అందుబాటులో ఉండే నేతగా కేటీఆర్‌కు పార్టీలో మంచి పేరుంది. దీంతో ఆయన పార్టీ బాధ్యతలు చూస్తారని కేసీఆర్ ప్రకటించడంతో కార్యకర్తలు, నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ బాధ్యతలు అందుకోనున్న తరుణంలో కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన ఇల్లు మారాలని యోచిస్తున్నట్లు తెరాస నేతలు చెబుతున్నారు. కేటీఆర్ ప్రస్తుతం కేసీఆర్‌తో కలిసి ప్రగతి భవన్‌లోనే నివాసముంటున్నారు. అక్కడ ప్రొటోకాల్ సమస్య కారణంగా భద్రతా సిబ్బంది అందరినీ లోనికి పంపడం సాధ్యం కాదు. దీంతో కేటీఆర్ ని కలవలేమన్న ఆందోళన కార్యకర్తల్లో నెలకొందట. దీంతో పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండేలా త్వరలోనే మరో ఇంటికి మారాలని కేటీఆర్ ఆలోచిస్తున్నారట.