సెకండ్ హాఫ్ లో వచ్చేవి హైలైట్…!

Padi Padi Leche Manasu Movie Updates

శర్వానంద్ హీరోగా, సాయి పల్లవి హీరొయిన్ గా నటించిన చిత్రం పడి పడి లేచే మనసు ఈ చిత్రం టైటిల్ తోనే సినిమాను ఆకట్టుకున్నాడు దర్శకుడు. ఈ చిత్రం నుండి లేటెస్ట్ గా ట్రైలర్ విడుదల చెయ్యడం జరిగింది. ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్సు వస్తుంది. ట్రైలర్ లో చూపించిన విధంగా వినోదభరితంగా ఉన్నది. మద్యలో ఎదో తెలవని షాక్ ట్విస్ట్ పెట్టినట్లు తెలుస్తుంది. హను రాఘవాపుడి సినిమాలు దాదాపుగా ఫస్ట్ ఆఫ్ చాలా ఫన్నీ గా రొమాంటిక్ గా సాగిపోతాయి కానీ సెకండ్ ఆఫ్ కు వచ్చే సరకి కథను నడిపించడంలో ట్విస్ట్ లు ఉపయోగించడం లో చాలా వరకు ఫెయిల్ అయ్యాడు ఇప్పటివరకు హను నుండి వచ్చిన సినిమాలు పరిశిలించినట్లు అయితే అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, లై లాంటి సినిమాలు ప్రధమర్డం చాలా సాఫీగా సాగినాయి.

Padi Padi Leche Manasu Movie Title Song Release D

ఆ తరువాత భాగం లో సినిమాను నడిపించడంలో విఫలం అయ్యాడు అందుకనే ఇప్పటివరకు సారైనా గుర్తింపు లేదు. కానీ పడి పడి లేచే మనసు చిత్రం విషయంలో తన పంథా మార్చుకున్నాడని తెలుస్తుంది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాలో లేని ట్విస్ట్ ఒక్కటి సెకండ్ ఆఫ్ లో ఉన్నదని చిత్ర బృంధం ద్వార తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ మాత్రం ఇద్దరి మద్య రొమాంటిక్ గా సాగుతుంది మరో విషయం ఏమిటి అంటే హను సినిమాలో హీరో ఎప్పుడు హీరొయిన్ వెంటపడి లవ్ చేస్తుంటాడు. మరల అదే ఫార్ములాను ఉపయోగించినట్లు తెలుస్తుంది. శర్వ, సాయి పల్లవి వెంట పడే లవ్ చేస్తున్నా సిన్స్ మనం ట్రైలర్ లో క్లియర్ గా చూపించారు. సెకండ్ ఆఫ్ లో వచ్చే ఆ ట్విస్ట్ ను తెలుగు సినిమా ప్రేమికులు తట్టుకుంటారో లేకపొతే ప్రేక్షకులు ఇచ్చే ట్విస్ట్ ను హను తట్టుకుంటారో చూడాలంటే మరికొద్ది రోజులు అగాలిసిందే.