కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్

కీలక వ్యాఖ్యలు చేసిన కేటీఆర్

తెలంగాణ రాష్ట్రం లో కరోనా వైరస్ మహమ్మారి ను అరికట్టడం లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు విజయం సాధించాయి అని చెప్పాలి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉంటే, మన రాష్ట్రం లో పరిస్థతి ఇంకా అదుపులోనే ఉంది అని మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే ఇది ముమ్మాటికీ కూడా వైద్య ఆరోగ్య శాఖ కృషి ఫలితమే అని అన్నారు.

అయితే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ నాయకత్వంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రజల్లో భరోసా నింపే విధంగా పని చేస్తూ ప్రజలను కరోనా వైరస్ నుండి కాపాడుతుంది అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. గత ఆరు నెలలుగా వైద్య ఆరోగ్య శాఖ అధ్బుతమైన పని చేసింది అని, ఇందులో భాగస్వాములు అయిన ప్రతి ఒక్కరికీ కూడా ధన్యవాదాలు అని మంత్రి వ్యాఖ్యానించారు. అయితే రానున్న కాలం లో వైద్య ఆరోగ్య శాఖ ను మరింత బలోపేతం చేసేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది అని కేటీఆర్ అన్నారు. ఈ ఏడాది సీజనల్ వ్యాధులు తగ్గాయి అని, మాతా శిశు మరణాలు రేటు కూడా తగ్గుముఖం పట్టింది అని, ప్రజల్లో వివిధ రకాలు అయిన వ్యాధుల్లో అవగాహన పెరిగింది అని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు.