కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాలపై మోదీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. తెలంగాణను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. సీఐఐ నిర్వహించిన సదస్సులో కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయ కారణాలతోనే కేంద్రం ఈ రకంగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ‘తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు పెండింగ్‌లోనే ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు రావడం లేదు. అభివృద్ధి అనేది కేవలం నాగపూర్‌కేనా? దక్షిణాది రాష్ట్రాలకు వద్దా?’ అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. హైదరాబాద్‌, బెంగళూరు విషయంలో మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని అసంతృప్తిని వ్యక్తం చేశారు.