Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సమైక్యరాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని గగ్గోలు పెట్టిన టీఆర్ఎస్ నేతలు.. విభజన తర్వాత కూడా అదే పని చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలంగాణ ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న కేసీఆర్.. మరోవైపు ఏపీ మీద పడి ఏడుస్తూనే ఉన్నారని టీడీపీ నేతలు కాస్త ఘాటుగానే వ్యాఖ్యానిస్తున్నారు. వారెందుకలా అంటున్నారో.. కేటీఆర్ మాటలు విన్నాక అందరికీ మరోసారి స్పష్టత వచ్చింది.
విభజన చట్టంలో భాగంగా ఏ రాష్ట్ర భూభాగంలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టులు ఆ రాష్ట్రానికే చెందుతాయి. అయితే విద్యుత్ మాత్రం ఇరు రాష్ట్రాలు పంచుకోవాలి. ఇదీ కేంద్రం చెప్పింది. అందుకు తగ్గట్లుగానే ఏపీ మొన్నటి వరకూ తెలంగాణకు కరెంటిచ్చింది. తెలంగాణ కూడా ఏపీ వాటా ఇస్తూ వచ్చింది. కానీ బిల్లుల చెల్లింపుల దగ్గర తకరారు మొదలుకావడంతో ఇద్దరూ విద్యుత్ నిలిపేసుకున్నారు. అంతే కేటీఆర్ సీన్లోకి వచ్చి సెంటిమెంట్ సెగలు రగిలిస్తున్నారు.
కేంద్రం విద్యుత్ విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందని అడ్డగోలుగా వాదిస్తున్నారు. అదే నిజమైతే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అయ్యేది కదా. అప్పులు కూడా చెరి సగం పంచేవారు కదా. ఉమ్మడి సంస్థలన్నీ మీకే దక్కాయిగా అంటూ లా పాయింట్లు తీస్తే గులాబీ నేతలకు మాచెడ్డ కోపమొచ్చేస్తుంది. టీఆర్ఎస్ నేతల తీరు చూస్తుంటే తేరగా ఎవరో తెచ్చినవి తమ ఘనత అని చెప్పుకోవడమే కానీ.. ఇంతవరకూ స్వయం సమృద్ధి మీద దృష్టి లేదన్న విషయం అర్థమౌతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.